Friday, January 16, 2026
Google search engine
HomeUncategorizedఏనుగుల దాడిలో ఐదుగురి దుర్మరణం

ఏనుగుల దాడిలో ఐదుగురి దుర్మరణం

జార్ఖండ్‌లోని అంగారా ప్రాంతపు జిదూ గ్రామంలో అడవి ఏనుగుల స్వైర విహారంతో ఐదుగురు వ్యక్తులు బలి అయ్యారు. వాటి ధాటికి మృతి చెందిన వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.గడిచిన 24 గంటలలో ఈ మదపుటేనుగుల అరాచకంలో ఈ ఘటనలు జరిగాయి. అదుపు తప్పిన ఏనుగులు వేర్వేరు చోట్ల చెలరేగాయి. ఈ క్రమంలో తమ ముందుకు వచ్చిన వారిపై ఘీంకరిస్తూ కిందపడేసి తొక్కివేశాయని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో మదపుటేనుగుల గుంపు తిరుగుతోంది. పంట పొలాలపై పడి ధ్వంసానికి దిగుతున్నాయి. తరిమికొట్టేందుకు యత్నించే వారిని లేదా తమ కండ్ల ముందుకు వచ్చిన వారిపై దాడికి దిగుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ ఏనుగుల మంద కోసం అటవీశాఖాధికారులు గాలిస్తున్నారు. మృతులలో ఇద్దరు ముసలివారైన మహిళలు ఉన్నట్లు వెల్లడైంది. ఇకీ ప్రాంతంలో స్థానికంగా బొగ్గు గనుల కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే రజ్వార్ ఈ ప్రాంతంలో తిరుగుతున్న ఏనుగుల మంద వీడియో చిత్రీకరించేందుకు , పైగా సెల్ఫీకి దిగేందుకు ప్రయత్నించి చావు కొని తెచ్చుకున్నాడు. ఈ ప్రాంతంలో 42 గజాలు మందలుగా విడిపోయి అడవులు వీడి, పల్లెలపై పడుతున్నాయి. దీనితో అనేక చోట్ల భయాందోళనలు అలుముకున్నాయి. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments