
రాష్ట్ర మత్స శాఖ నాంపల్లిలో ఫిష్ క్యాంటీన్‌ను ప్రారంభించింది. నాంపల్లి గగన్ విహార్ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన ఫిష్ క్యాంటీన్ ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ ఎంపీలు చామల కిరణ్‌కుమార్ రెడ్డి, అనిల్ కుమార్, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇదివరకే మత్స శాఖ ప్రధాన కార్యాలయం (మాసాబ్ ట్యాంక్) పక్కనే ఫిష్ క్యాంటీన్ ఉన్నది.




