
హైదరాబాద్: పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) అటాచ్ చేసింది. మధుసూదన్ రెడ్డికి చెందిన రూ.80 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. మధుసూదన్ రెడ్డికి చెందిన కంపెనీ రూ.300 కోట్ల అక్రమాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ రూ.300 కోట్లు అక్రమాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వానికి మధుసూదన్ రెడ్డి రూ.39 కోట్ల రాయల్టీ చెల్లించలేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇడి ఆయన ఆస్తులను అటాచ్ చేసినట్లు సమాచారం.




