Sunday, November 23, 2025
Google search engine
HomeUncategorizedఅనిల్ రావిపూడి బర్త్‌డే.. చిరంజీవి సినిమా సెట్‌లో గోల గోల

అనిల్ రావిపూడి బర్త్‌డే.. చిరంజీవి సినిమా సెట్‌లో గోల గోల

హైదరాబాద్: టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్స్‌లో అనిల్ రావిపూడి ఒకరు. కామెడీని ప్రధాన ఆధారంగా చేసుకొని ఇప్పటివరకూ ఆయన తీసిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ ఏడాది సంక్రాంతికి వెంకటేష్ హీరోగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించారు అనిల్. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా ఏకంగా రూ.300 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం అనిల్ మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేస్తున్నారు. ‘మన శంకర వరప్రసాద్ గారు’ అనేది ఈ సినిమా టైటిల్.

కాగా, ఆదివారం అనిల్ రావిపూడి తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్ర యూనిట్ ఆయనకు ఓ సర్‌ప్రైజ్ ఇచ్చింది. సినిమా షూటింగ్ సందర్భంగా జరిగిన కొన్ని ఫన్నీ మూమెంట్స్‌తో కలిపి ఓ వీడియో విడుదల చేసింది. ఈ వీడియో చూస్తే సినిమా ఇంకేంత ఫన్నీగా ఉంటుందో అర్థమవుతోంది. కాగా, ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా.. సుస్మిత కొణిదెల, సాహు గారపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భీమ్స్ ఈ సినిమాకు సంగీతం అందించగా.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘మీసాల పిల్ల’ అనే పాట సూపర్ హిట్ అయింది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments