
వేసవి రాకముందే చలికాలంలోనే మంచి నీటికి కటకట ఏర్పడుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చలికాలంలోనే నీటికి కటకటా ఉంటే రానున్న వేసవిలో మంచినీటి మరింత కొరత ఏర్పడి అవకాశం ఉందని గ్రామస్తులు వాపోతున్నారు. కొత్తపెళ్లి మండలంలోని బద్దిపల్లి గ్రామంలో ఈ చలికాలంలోనే మంచినీటికి కొరత ఏర్పడి మహిళలు రోడ్డుపై బిందెలు పెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ పాలకవర్గం లేకపోవడం సర్పంచి ఎన్నికలు లేకపోవడంతో గ్రామం అభివృద్ధిలో అధోగతి పాలవుతుందని ప్రజల నుంచి వెళ్లి వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక పాలన గ్రామపంచాయతీలో ప్రత్యేక అధికారులను నియమించి చేతులు దులుపుకుంది. కానీ ప్రత్యేక పాలన అధికారులు చూసి చూడనట్టు వివరించడం గ్రామంలో పలు సమస్యలు ఆటకిక్కడంతోపాటు ప్రధాన సమస్య అయిన మంచినీటి సమస్యను పట్టించుకోకపోవడంపై బద్దిపల్లి తో పాటు పలు గ్రామాల్లో ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని గ్రామవాసులు వాపోతున్నారు. ప్రత్యేక అధికారుల పాలన తో గ్రామాల్లో సమస్యలు పరిష్కారం కావడం లేదని వాదనలు వినిపిస్తున్నాయి.
సర్పంచులు ఉంటేనే స్థానిక పరిస్థితులకు తగ్గట్టుగా సమస్యలు పరిష్కరించి, గ్రామం పట్ల అవగాహన ఉండి ప్రజలతో మమేకమై సమస్యలు పరిష్కరించే దిశగా సర్పంచులు ఉంటారనే భావన గ్రామాల్లో వినిపిస్తున్నాయి. బద్దిపల్లి గ్రామంలో సంబంధిత పంచాయతీ అధికారి గ్రామ సమస్యలు పట్టించుకోక పోవడంతో గ్రామాల్లో సమస్యలు అలాగే ఉండిపోతున్నాయని ప్రజలను నుంచి వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత బద్దిపల్లి గ్రామ పంచాయతీ అధికారి మరో గ్రామ పంచాయతీకి ఇన్చార్జిగా వ్యవహరించడంతో ఈ రెండు గ్రామాల్లో సమస్యలు పెరిగిపోతున్నాయని వాదనలు వినిపిస్తున్నాయి. బద్దిపల్లి గ్రామం తో పాటు కొత్తపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలనతో సమస్యలు పెరిగిపోతున్నాయని, ప్రత్యేక అధికారులు సమస్యలను పట్టించుకోకుండా చూసి చూడనట్లు వదిలేస్తున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. గ్రామంలో మంచినీటి కొరత కొరకు బోర్లు వేసి మంచినీటిని అందించాలని బద్దిపల్లి గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. అదేవిధంగా మండలంలోని అన్ని గ్రామాల్లో మంచినీటి వసతి ఏర్పాటు చేసి ప్రజలకు మంచినీటిని అందించాలని ప్రజలు కోరుకుంటున్నారు.
తక్షణమే ఉన్నత అధికారులు స్పందించి మంచినీటి వసతి ఏర్పాటు చేయాలని బద్దిపల్లి గ్రామ ప్రజలు, మహిళలు కోరుతున్నారు. ఆర్ డబ్ల్యు ఎస్ ఏఈ అనూషను వివరణ కోరగా వాటర్ సమస్య పరిష్కరించామని, ఇప్పుడు మంచినీటిని అందించామని ఆమె తెలిపారు .అదే విధంగా పంచాయతీ సెక్రటరీ కన్యకుమారి వివరణ కోరగా సమస్యను పరిష్కరించి మంచినీటిని ఈరోజే అందించామని తెలిపారు.




