
హీరో అల్లరి నరేష్ నటించిన థ్రిల్లర్ ‘12ఎ రైల్వే కాలనీ’ని నాని కాసరగడ్డ దర్శకత్వంలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. పవన్ కుమార్ సమర్పణలో పోలిమేర మూవీ సిరీస్ తో పాపులరైన డాక్టర్ అనిల్ విశ్వనాథ్ షోరన్నర్‌గా పనిచేశారు. ఆయన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాశారు. కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా నటించారు. నవంబర్ 21న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భం గా మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “మొదటిసారి ‘12ఎ రైల్వే కాలనీ’ లాం టి థ్రిల్లర్ సినిమాకి మ్యూజిక్ అందించాను. ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో ఇది డిఫరెంట్ జోనర్ సినిమా. -నిర్మాత శ్రీనివాస నన్ను సంప్రదించి… ఈ సినిమాను మన కాంబినేషన్లో చేస్తే బాగుంటుందని చెప్పా రు. పొలిమేర సినిమా దర్శకుడు అనిల్ విశ్వనాథ్ ఈ సినిమాకి రచయితగా, షోరన్నర్‌గా పనిచేయడం ఆనందాన్నిచ్చింది.
-ఇందులో రెండు మెలోడీ సాంగ్స్ ఉన్నాయి. ఆ రెండు పాటలు కూడా కథ నుంచే పుడతాయి. నేను చేసిన బలగం, మాస్ జాతర, ధమాకా, మ్యాడ్, టిల్లు స్క్వేర్, సంక్రాంతికి వస్తున్నాం.. వీటిలో ఒకటి గ్రామీణ నేపథ్యం, మరొకటి మాస్, యూత్‌ఫుల్, ఇంకొకటి ఫ్యామి లీ… ఇలా డిఫరెంట్ జోనర్ సినిమాలు చేసే అవకాశం నాకు దొరికింది. ఇన్ని వేరియేషన్స్ ఉన్న సినిమాలు ఒకేసారి రావడం నా అదృష్టం. -ఇందులో 12ఎ రైల్వే కాలనీ సినిమా ఇంకా స్పెషల్. అందరూ మ్యూజిక్ బాగుందని చెబుతున్నారు. -ఇక ప్ర స్తుతం రవితేజతో భర్త మహాశయులకు విజ్ఞప్తి, చిరంజీవితో మన శం కర వరప్రసాద్ గారు, డెకాయిట్, టైసన్ నాయుడు, సంపత్ నందితో భోగి, విశ్వక్సేన్తో ఫంకీ చిత్రాలు చేస్తున్నాను”అని అన్నారు.




