
రావులపాలెం: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కలకలం రేగింది. రావుల పాలెంలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా అనుచరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం మారేడుమిల్లి వద్ద జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మా మద్వి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన అనుచరుడు మడివి సరోజ్ రావులపాలెంలో ఉన్నట్లు గుర్తించారు. బుధవారం అతడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. సరోజ్ స్వస్థలం అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం నెల్లిపాక.




