
వేములవాడ: మంగళవారం పోలీసులు, కేంద్ర బలగాలు నిర్వహించిన ఆపరేషన్‌లో పలువురు మావోలు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందగా.. పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దాడిలో కీలక మావోయిస్టు నేత హిడ్మా ఆయన భార్య హతమయ్యారు. ఈ విషయపై కేంద్ర మంత్రి బండి జంజయ్ సంజయ్ మాట్లాడారు. అర్భన్ నక్సలైట్ల మాటలు విని చెడిపోవద్దని సంజయ్ హితవు పలికారు. వాళ్లంతా ఎసి గదుల్లో ఉండి పైరవీలు చేసుకుంటున్నారని విమర్శించారు.
వేములవాడలో పంజయ్ వీడియాతో మట్లాడుతూ.. బుల్లెట్లను నమ్ముకున్న మావోయిస్టులు ఏం సాధించారని ప్రశ్నించారు. ‘‘ఇన్నాళ్లూ తుపాకీ చేతబట్టిన హిడ్మ ఏం సాధించారు. ఇవాళ ఏపిలో జరిగన ఎదురు కాల్పల్లో హిడ్మా, ఆయన భార్య మరణించారు. తపాకీ చేతపట్టి చర్చలు కావాలంటే కుదరదు. ఇప్పటికే లొంగిపోయిన మావోలు క్షేమంగా ఉన్నారు. బుల్లెట్లను నమ్మకుంటే ఏం సాధించలేరు.. బ్యాలెట్‌ను నమ్ముకోండి అన సంజయ్ అన్నారు.




