
మనతెలంగాణ/సిటీబ్యూరోః ఉప ఎన్నిక ప్రక్రియ ముగియడంతో జూబ్లీహిల్స్‌లో అమలులో ఉన్న ఎన్నికల కోడ్‌ను ఎత్తివేశారు. ఈ మేరకు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల సంఘం అక్టోబర్ 6న ఎన్నిక షెడ్యూల్‌ను విడుదల చేయడంతో కోడ్ అమలులోకి వచ్చిన తెలిసిందే.
ఈనెల 11న ఎన్నిక,14న ఎన్నికల ఫలితం వెలువడిన విషయమూ విధితమే. అయితే, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎంసిసి)ను ఎన్నికల కమిషన్ ఎత్తివేసినట్లు ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి అమలులో ఉన్న ఎంసిసి,ఉప ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో ఇక కోఢ్ వర్తించదని ఉత్తర్వులో పేర్కొన్నది.




