
హైదరాబాద్: గోషామహల్ పరిధి చాక్నవాడిలో ఐదంతస్తుల భవనానికి పగుళ్లు ఏర్పడ్డాయి. పక్కన నిర్మిస్తున్న నూతన భవనం పిల్లర్స్ తవ్వడం వల్లే ఇలా పగుళ్లు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. పగుళ్లు రావడంతో పక్కనే ఉన్నవారు భయాందోళన చెందారు. కుంగిన భవనానికి హైడ్రా, జిహెచ్ఎంసి సిబ్బంది సపోర్టు ఇచ్చారు. భవనం లోపల ఉన్న నివాసులను తక్షణమే ఖాళీ చేయించాలని చుట్టు పక్కల స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.




