Sunday, November 23, 2025
Google search engine
HomeUncategorizedభారత బౌలర్ల వీరవిహారం.. సౌతాఫ్రికా-ఎ స్కోర్ ఎంతంటే..

భారత బౌలర్ల వీరవిహారం.. సౌతాఫ్రికా-ఎ స్కోర్ ఎంతంటే..

రాజ్‌కోట్: భారత పర్యటనలో ఉన్న సౌతాఫ్రికా-ఎ జట్టు, భారత-ఎ జట్టుతో రెండు అనధికారిక టెస్టులు, మూడు అనధికారిక వన్డేల సిరీస్‌లో తలపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ డ్రాగా ముగియగా.. వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో భారత-ఎ జట్టు విజయం సాధించింది. ప్రస్తుతం జరుగుతున్న రెండో వన్డేలో సఫారీ ఆటగాళ్లకి భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ఫలితంగా సఫారీలను స్వల్ప స్కోర్‌కే పరిమితం చేశారు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా-ఎ జట్టు 30.3 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌట్ అయింది. సౌతాఫ్రికా బ్యాటింగ్‌లో రివాల్డో మూన్సామి (33) టాప్ స్కోరర్‌గా నిలవగా.. డెలానో పోట్గీటర్ 23, డయాన్ ఫారెస్టర్ 22, లువాన్-డ్రే ప్రిటోరియస్ 21, ప్రేనేలన్ సుబ్రాయోన్ 15 పరుగులు చేశారు. భారత బౌలింగ్‌లో నిషాంత్ సింధు నాలుగు వికెట్లు, హర్షిత్ రాణా 3 తీసి సఫారీలను కుప్పకూల్చారు. వీరికి ప్రసిద్ధ్ కృష్ణ 2, తిలక్ వర్మ 1 వికెట్‌తో తమ వొంతు సహకారం అందించారు. ప్రస్తుతం ఇండియా 2 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 15 పరుగులు చేసింది. క్రీజ్‌లో అభిషేక్ శర్మ (12), రుతురాజ్ గైక్వాడ్ (3) ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments