
హైదరాబాద్: పెట్టుబడుల ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. దావోస్ తరహాలో ఈ సెషన్లు నిర్వహించగలిగాం అని అన్నారు. 60 దేశాల ప్రతినిధులు సిఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరయ్యారు. సిఐఐ సదస్సుకు హాజరైన అతిథులకు జ్ఞాపికలు అందించారు. 700లకు పైగా బి టూ బి సమావేశాలు జరిగాయి. విశాఖ సిఐఐ సదస్సు వాలిడిలరీ సెషన్ లో సిఎం ప్రసంగించారు. సిఐఐ సదస్సు ద్వారా రూ. 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, పెట్టుబడులే కాదు అని.. ఆలోచనల్ని పంచుకోగలిగాం అని.. తెలియజేశారు. వికసిత్ భారత్- 2047 లక్ష్యాలకు అనుగుణంగా పాలసీలు రూపకల్పన చేస్తున్నామని, పరిశ్రమలకు అనుగుణంగా కార్మిక, ఆర్థిక, ఇన్ ఫ్రా సంస్కరణలు, పారిశ్రామిక ప్రోత్సాహకాలకు ఎస్క్రో ఖాతాను నిర్వహిస్తున్నాం అని.. పేర్కొన్నారు. వచ్చే ఏడాది పెట్టుబడుల సదస్సుకూ మీరంతా హాజరు కావాలని, పారిశ్రామికవేత్తలు ఎపిలో తరచూ పర్యటించాలని చంద్రబాబు నాయుడు కోరారు.




