
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో తనని నమ్మి ఓటు వేసిన అందరికీ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. ఉపఎన్నికలో ఆయన బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై దాదాపు 24వేలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సిఎం రేవంత్ రెడ్డి, నేతలందరికీ ధన్యవాదాలు తెలిపారు. బిఆర్ఎస్ నేతలు తనపై ఎన్నో దుష్ప్రచారాలు చేశారని అన్నారు. అన్ని దుష్ప్రచారాలను ప్రజలు తమ ఓటుతో తిప్పికొట్టారని పేర్కొన్నారు. నియోజకవర్గ సమస్యలను సిఎం దృష్టికి తీసుకెళ్తానని.. పదేళ్లలో బిఆర్ఎస్ చేసిందేమీ లేకనే ప్రచారంలో చెప్పుకోలేదని తెలిపారు. కేవలం తనపై దుష్ప్రచారం చేసి గెలవాలని బిఆర్ఎస్ చూసిందని.. బెదిరిస్తే ప్రజలు ఓటు వేసే రోజులు ఎప్పుడో పోయాయని స్పష్టం చేశారు.




