
హైదరాబాద్: విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా కరెంటు సరఫరా చేసే వ్యవస్థను నెలకొల్పామని డిప్యూటీ సిఎం భట్టివిక్రమార్క తెలిపారు. ప్రజలకే జవాబు దారీగా ఉంటామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కొనియాడారు. ఎంత త్వరగా ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుంటే అంత వేగంగా బిల్లులు మంజూరు చేస్తామని భట్టి తెలియజేశారు. ప్రతి పైసా ప్రజల అవసరాలకే ఖర్చు పెడతామని, ప్రజల సొమ్ము దోపిడీకి గురి కానివ్వమని అన్నారు. ఎక్కడ ఉన్నా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని, మధిర ప్రజలు వేసిన ప్రతి ఓటుకు గౌరవం తీసుకువస్తామని భట్టి పేర్కొన్నారు.




