
అమరావతి: : నల్గొండ జిల్లా ఎపి లింగోటం గ్రామం లోరోడ్డు ప్రమాదం జరిగింది. యూటర్న్ తీసుకుంటున్న బస్ ను వెనుక నుంచి లారీ ఢీకొంది. ఉల్లిపాయల లోడ్ తో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.




