
చాలామంది గుండె జబ్బు వచ్చే పేషెంట్లకు ఆఖరి సమయంలో హార్ట్ ఫెయిల్యూర్ అనేది వస్తుంది.. గుండె ప్రధాన పని ఏంటి అంటే రక్తాన్ని శరీరంలోని వివిధ భాగాలకు పంపించడమే.. అది పుట్టినప్పటినుంచి చనిపోయేదాకా నిరంతరం పనిచేసే ఒక పంపు..
కానీ ఆ పంపు పని గుండె చేయలేనప్పుడు అది పూర్తి ఫెయిల్యూర్ అయిపోయి కాళ్ళ వాపులు ఆయాసము వస్తాయి.. గుండె ఎన్లార్జ్ అయిపోయి చాలా పెద్దగా అవుతుంది.. అప్పుడు దానిని కార్డియామయోపతి అని అంటారు..
అటువంటి అప్పుడు హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ అనేది చాలా అవసరం అంటే గుండె మార్పిడి శస్త్ర చికిత్స.. కానీ ఇది చాలామందికి అవసరం ఉండడము మరియు గుండెను చనిపోయినప్పుడు కడావరిక్ ట్రాన్స్ ప్లాంటుకు దానం చేయడం మన లాంటి దేశాలలో చాలా తక్కువగా ఉంటుంది.. అన్ని దేశాలలో కూడా గుండె ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం ఎదురు చూసే వాళ్లకు గుండె దొరకడం అనేది కష్ఠం గా ఉంటుంది.. ఎందుకంటే అవయవ దానం అనే కాన్సెప్ట్ ఇప్పుడిప్పుడే మన దేశంలో వస్తూ ఉంది.. బ్రెయిన్ డెడ్ అయిన పేషంట్ల అవయవాలను మనం దానం చేయవచ్చు..
అలా గుండె మార్పిడి కోసం వెయిటింగ్ చేస్తున్న వాళ్ళకు ఈ హార్ట్ ఫెయిల్యూర్ నుంచి ఉపశమనం కలిగించే కి ఓ పరికరాన్ని అనగా ఓ యంత్రాన్ని గుండె లోపల పంపు చేయడానికి అమరుస్తారు.. కొన్ని కారణాల వలన గుండె మార్పిడి చేయడానికి పనికిరాని అప్పుడు కూడా ఈ యంత్రాన్ని అమరుస్తారు.. దీనిని లెఫ్ట్ వెంట్రుకలర్ అసిస్టెంట్ డివైస్ LVAD అని అంటారు.. ఇది ఎడమ జఠరికలో అమరుస్తారు అక్కడినుంచి రక్తాన్ని తీసుకొని బృహద్దమని అనగా అయోర్టాలోకి పంపిస్తుంది.. ఇది బ్యాటరీ సహాయంతో పనిచేస్తుంది ఈ బ్యాటరీ లోకి కనెక్ట్ చేసే లీడ్ ను మన చర్మం నుంచి బయటికి తీసుకొచ్చి పెడతారు.. ఇవి రీఛార్జిబుల్ బ్యాటరీలు 12 గంటల నుంచి 24 గంటల వరకు పనిచేస్తాయి..
ఈ పరికరం ఖరీదు దానికి అమర్చేకి అంతా కలిపి ఓ 40-80 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుంది.. ఇది మన దేశంలో చాలా తక్కువగా అమరుస్తారు కానీ జర్మనీ లాంటి దేశాలలో ఎక్కువగా అమరుస్తారు.. కొందరు గుండె మార్పిడి కంటే ఇదే సౌకర్యంగా ఉంది అని కూడా ఫీల్ అవుతారు.. మన దేశంలో ఇది రేటు తక్కువగా ఉండండం వల్ల దేశ విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజం ద్వారా అమర్చుకుంటూ ఉన్నారు..
ఇది చాలా ఖరీదైనది కానీ ప్రాణాలు పోకుండా ఆపుతుంది…
– డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి MS MCh
గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు
ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు




