Sunday, November 23, 2025
Google search engine
HomeUncategorizedకృష్ణ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. డైరెక్టర్ ఎవరంటే..

కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. డైరెక్టర్ ఎవరంటే..

సినిమా ఇండస్ట్రీలో వారసత్వంగా హీరోలు రావడం సాధారణమే. స్టార్ హీరోలకు వారసులుగా ఇప్పటికే చాలా మంది హీరోలుగా పరిచయం అయ్యారు. అందులో కొందరు సక్సెస్ అయితే.. మరికొందరు ఫెయిలై ఇంటి బాట పట్టక తప్పలేదు. ఇక ఒకప్పటి స్టార్ హీరో కృష్ణ ఫ్యామిలీ నుంచి హీరోగా మరో అబ్బాయి రంగ ప్రవేశం చేసేందుకు సిద్ధమవుతున్నాడు. మహేశ్‌బాబు సోదరుడు, దివంగత రమేశ్ బాబు తనయుడు నటుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు చాలా రోజులుగా వార్తలు వచ్చాయి. ‘ఆర్ఎక్స్100’ ఫేమ్ అజయ్ భూపతి రమేశ్‌బాబు తనయుడు జయకృష్ణ ఘట్టమనేనిని హీరోగా పరిచయం చేస్తున్నట్లు రూమర్స్ వినిపించాయి.

ఇప్పుడు ఆ రూమర్సే నిజం అయ్యాయి. జయకృష్ణని హీరోగా పరిచయం చేస్తున్నట్లు అజయ్ భూపతి స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు ఆయన సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టారు. ‘ఎబి4’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా పోస్టర్‌ని విడుదల చేశారు. తిరుమల బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతుందని ఈ పోస్టర్‌ చూస్తే అర్థమవుతోంది. జయకృష్ణను హీరోగా పరిచయం చేయడం తనకు ఎంతో థ్రిల్లింగ్‌గా, గర్వంగా ఉందన్నారు. ‘ఒక గొప్ప కథతో మరింత గొప్ప బాధ్యత వస్తుందని’ పేర్కొన్నారు. అశ్వినీ దత్ ఈ సినిమాను సమర్పిస్తుండగా.. చందమామ కథలు పిక్చర్స్ బ్యానర్‌పై జెమినీ కిరణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ను త్వరలోనే ప్రకటిస్తామని అజయ్ స్పష్టం చేశారు.  

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments