
ఉప్పల్: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిలా ఉప్పల్ మండలంలోని మల్లికార్జుననగర్‌లో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. కానిస్టేబుల్ శ్రీకాంత్(42) ఇంట్లో ఉరేసుకొని చనిపోయాడు. 2009 బ్యాచ్‌కు చెందిన శ్రీకాంత్ ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. గత నెల 23 నుంచి కానిస్టేబుల్ శ్రీకాంత్ విధులకు హాజరుకావడంలేదు. ఉప్పల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆర్థిక సమస్యలే ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.




