
మియాపూర్: జిహెచ్ఎంసి పరిధిలోని మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో అల్విన్ కాలనీ దగ్గర హ్యాష్ ఆయిల్ పట్టుకున్నారు. సోనియా అనే వ్యక్తి 1.6 కిలోలు గల హ్యాష్ ఆయిల్ ను ఒరిస్సా నుండి హైదరాబాద్ కు తీసుకొస్తుండగా మాదాపూర్ ఎస్ఒటి పోలీసులు పట్టుకున్నారు. విశ్వనీయ సమాచారంతో మేరకు వీరిని పట్టుకున్నామని మాదాపూర్ ఎస్ఒటి టీమ్ వెల్లడించింది. ఒరిస్సా కు చెందిన సోనియా హ్యాష్ అయిల్ సరఫరా చేస్తున్నాడని, అతనికి సహాయం చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. ఒరిస్సా రాష్టానికి చెందిన సోనియా, ఎపికి చెందిన లక్ష్మి, దుర్గ ప్రసాద్, దుర్గగా గుర్తించామన్నారు. 1.6 కేజీల హ్యాష్ ఆయిల్ విలువ మూడు లక్షల రూపాయల వరకు ఉంటుందన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




