
హైదరాబాద్: నల్గొండ జిల్లాలో వేములపల్లి మండలం బుగ్గబావి గూడెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ ను ట్రావెల్ బస్సు ఢీకొంది. ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ట్రాక్టర్ బోల్తాపడింది. నలుగురు కూలీలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలిపారు.




