
హైదరాబాద్ సిటిలో మరోసారి డ్రగ్ పార్టీ కలకలం రేపింది. సోమవారం రాత్రి గచ్చిబౌలిలో నిర్వహిస్తున్న డ్రగ్ పార్టీని ఎస్ఓటి పోలీసులు భగ్నం చేశారు. గచ్చిబౌలి టిఎన్జిఒ కాలనీలోని కోలివింగ్ గెస్ట్ రూంలో డ్రగ్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు మెరుపు దాడులు చేశారు. డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న 12 మందిని అరెస్ట్ చేశారు. పార్టీలో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ తెచ్చి యువకులకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ దాడుల్లో డ్రగ్స్ సప్లై చేస్తున్న గుత్తా తేజకృష్ణ అనే వ్యక్తితో పాటు మరో నైజీరియన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులుపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.




