
నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్‘. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. సరికొత్త ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ నెల 7న హిందీతో పాటు తెలుగులో.. ఈ నెల 14న, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరల్డ్‌వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ సందర్భంగా నిర్మాత ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ “ మనం లవ్ స్టోరీలను ఎవరో ఒకరి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి. ఈ కథ హీరోయిన్ కోణంలో ఉంటుంది. అలాంటప్పుడు స్టార్స్‌ను ఈ మూవీకి హీరోగా తీసుకోలేం. పర్ ఫార్మర్స్‌నే తీసుకోవాలి.
దీక్షిత్ మంచి పర్‌ఫార్మర్. రశ్మిక లాగే తన క్యారెక్టర్ లో ఆకట్టుకునేలా నటించాడు. – ‘ది గర్ల్ ఫ్రెండ్‘ సినిమాను మేమే సొంతంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. థియేట్రికల్ గా ఈ మూవీ బాగా వర్కవుట్ అవుతుందని నమ్ముతున్నాం”అని అన్నారు. విద్య కొప్పినీడి మాట్లాడుతూ ‘ ది గర్ల్ ఫ్రెండ్‘ సినిమా కథ విన్నప్పుడే మేము స్టోరీకి బాగా కనెక్ట్ అయ్యాం. ఇది రెగ్యులర్ కమర్షియల్ స్టోరీ కాదు. ఈ సినిమా చూశాక ప్రతి ఒక్కరూ ఒక మెసేజ్ ను తీసుకుంటారు. సెన్సార్ వాళ్ల దగ్గర నుంచి డైరెక్టర్ కు నేషనల్ అవార్డ్ దక్కుతుందనే ప్రశంసలు వచ్చాయి. -ఈ సినిమాను యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా చూసి ఎంజాయ్ చేస్తారు”అని పేర్కొన్నారు.




