
హైదరాబాద్: యాదాద్రి జిల్లా బిబినగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్- హైదరాబాద్ జాతీయ రహదారిపై ఇద్దరిని థార్ వాహనం ఢీకొని యువకుడు, చెరువులో పడి యువతి మృతి చెందారు. డివైడర్ ను కూడా ఢీకొనడంతో వాహనంలో ఉన్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన బిబినగర్ చెరువు కట్ట వద్ద చోటుచేసుకుంది. క్షతగాత్రులను భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.




