Sunday, November 23, 2025
Google search engine
HomeUncategorizedమైమరపించే మెలోడి

మైమరపించే మెలోడి

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న యూనిక్ ఎంటర్‌టైనర్ ’ఆంధ్రా కింగ్ తాలూకా’ నవంబర్ 28న థియేటర్లలో విడుదల కానుంది. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర సూపర్‌స్టార్‌గా కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. వివేక్, మెర్విన్ స్వరపరిచిన మొదటి రెండు పాటలు చార్ట్‌బస్టర్ హిట్స్ అయ్యాయి. శుక్రవారం మేకర్స్ థర్డ్ సింగిల్ ’చిన్ని గుండెలో’ను విడుదల చేశారు. ఇక రామ్ అద్భుతంగా పాడిన మొదటి పాట ఒక గ్రామం నేపథ్యంలో సెట్ చేయబడిన ప్రేమకథను వివరిస్తుంది. రెండో పాటలో రామ్ తన వాయిస్ తో అభిమానుల క్రేజ్, ఫ్యాన్ వార్స్, ఫస్ట్ డే ఫస్ట్ షో ఉత్సాహాన్ని అద్భుతంగా చూపించారు. ఇప్పుడు విడుదలైన మూడో పాట కూడా అంతే మ్యాజికల్ గా వుంది. రాత్రి సముద్రతీరంలో హీరో, హీరోయిన్ ఇద్దరూ ఇసుకపై నక్షత్రాలను చూస్తూ చల్లని గాలిని ఆస్వాదిస్తారు.

సమయం వేగంగా సాగిపోతుందనే ఆందోళనతో హీరోయిన్ మాట్లాడగా, హీరో మనమే ఈ క్షణాన్ని ఆపొచ్చు అని చెబుతాడు. అప్పుడు పాట మొదలవుతుంది. ఈ పాట ప్రేక్షకులను ఒక మ్యాజికల్ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. నక్షత్రాల మధ్య ఆటలాడుతూ, వెన్నెల్లో తేలియాడుతూ, ఇద్దరూ మధురమైన క్షణాలను పంచుకుంటారు. వివేక్, మర్విన్ అందించిన సంగీతం, మర్విన్ సొలోమన్, సత్య యామినీ గాత్రం అద్భుతంగా వున్నాయి. కృష్ణకాంత్ రాసిన సాహిత్యం లవ్ ఫీలింగ్ అద్భుతంగా చూపించింది. ఆన్-స్క్రీన్‌లో రామ్, భాగ్యశ్రీ బోర్స్‌ల కెమిస్ట్రీ మైమరపించింది. జానీ మాస్టర్ ఈ రొమాంటిక్ నంబర్‌ను అద్భుతంగా కొరియోగ్రాఫ్ చేశారు. గ్రేట్ ఎనర్జీతో ఈ పాట ఆల్బమ్‌లో మరో బ్లాక్‌బస్టర్‌గా నిలవడం ఖాయం. ఈ చిత్రంలో రావు రమేశ్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments