
ఎట్టకేలకు అల్లు వారబ్బాయి అల్లు శిరీష్ ఒక ఇంటివాడు కాబోతున్నాడు. శుక్రవారం నయనికా రెడ్డితో శిరీష్ నిశ్చితార్థం చాలా ఘనంగా జరిగింది. వీరి నిశ్చితార్ధం అతికొద్ది బంధుమిత్రుల మధ్య వధువు ఇంట ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరయ్యారు. అల్లు అరవింద్ దంపతులు, అల్లు అర్జున్, సతీమణి స్నేహా రెడ్డి, చిరంజీవి దంపతులు, రామ్ చరణ్ దంపతులు, వరుణ్ తేజ్ దంపతులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇక క్రీమ్ కలర్ డిజైనర్ డ్రెస్ లో అల్లు శిరీష్ కనిపించగా.. ఎరుపు లంగా వోణి ధరించి చాలా సింపుల్ గా నయనికా కనిపించింది. ఇక రింగులు మార్చుకుంటున్న ఫోటోలను షేర్ చేస్తూ శిరీష్.. ఎట్టకేలకు నా జీవితానికి ప్రేమగా మారిన నయనికాతో సంతోషంగా నిశ్చితార్థం జరుపుకున్నాను అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.




