
చింతకాని: ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో సిపిఎం నేతను దారుణంగా హత్య చేశారు. పాతర్లపాడులో రైతు సిపిఎం రైతు సంఘం నేత సామినేని రామారావు శుక్రవారం ఉదయం వాకింగ్ వెళ్లాడు. అతడిని గుర్తు తెలియని దుండగులు గొంతుకోసి హత్య చేశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




