
గాడ్ ఆఫ్ ది మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్‌ఫుల్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ’అఖండ 2: తాండవం’. ఇది వారి సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ అఖండకు సీక్వెల్. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్ ని నెక్స్ లెవల్ లో అందిస్తున్నారు సెన్సేషనల్ కంపోజర్ తమన్. సంస్కృత శ్లోకాలను అద్భుతంగా పఠించే నైపుణ్యం వున్న పండిట్ శ్రవణ్ మి శ్రా, పండిట్ అతుల్ మిశ్రా సోదరులతో ఇప్పటికే గూస్‌బంప్స్ స్కోర్‌ని రికార్డ్ చేశారు.
ఇప్పుడు సర్వేపల్లి సిస్టర్స్‌ని పరిచయం చేస్తున్నారు. సర్వేపల్లి సిస్టర్స్ ‘అఖండ 2: తాం డవం’ కోసం తమ దైవిక గానాన్ని అందించారు. తమన్ అందిస్తున్న బ్యాక్‌గ్రౌండ్ పవర్‌ఫుల్ స్కోర్‌లో సర్వేపల్లి సిస్టర్స్ ఎనర్జిటిక్ గాత్రంతో నెక్స్ లెవెల్ స్కోర్ రికార్డు అవుతోంది. ఈ చిత్రంలో సంయుక్త ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఆది పినిశెట్టి ఓ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. హర్షాలి మల్హో త్రా కీలక పాత్రలో కనిపించనున్నారు. అఖం డ 2: తాండవం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.




