
ఛండీగఢ్: 15 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి కారులో ఆమెపై నలుగురు సామూహిక అత్యాచారం చేశారు. ఈ సంఘటన హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అక్టోబర్ 26 సాయంత్రం సెక్టార్ 18 మార్కెట్‌కు వెళ్లిన బాలిక రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యుల వెతికారు. ఎక్కడి కనిపించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అక్టోబర్ 27 తెల్లవారుజామున నాలుగు ప్రాంతంలో బాలికను ఇంటి వద్ద దుండగులు వదలి వెళ్లారు. బాలికను నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అనంతరం కారులో బాలికపై నలుగురు సామూహిక అత్యాచారం చేశారు. పోలీసులు పోక్సో యాక్టు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక సిసి కెమెరాలను పరిశీలిస్తున్నామని, అనంతరం నిందితులను అరెస్టు చేస్తామని పోలీస్ అధికారి విష్ణు మిట్టర్ తెలిపాడు.




