
ఢిల్లీ: ప్రైవేటు వీడియోలు తొలగించకపోవడంతో తన సహజీవనం చేస్తున్న ప్రియుడిని మరో ఇద్దరు స్నేహితులతో కలిసి హత్య చేసింది. అనంతరం హార్డ్‌డిస్క్‌తో పారిపోయింది. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఢిల్లీలోని తిమార్‌పూర్‌లో రామ్‌కేశ్ మీనా(32) అనే యువకుడు సివిల్స ప్రిపేర్ అవుతున్నాడు. తిమార్‌పూర్ ఓ ప్లాట్‌లో పేలుడు సంభవించడంతో రామ్‌కేశ్ మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. శవ పరీక్ష అగ్ని ప్రమాదంలో చనిపోయినట్టు తేలింది. స్థానిక సిసి కెమెరాలను పోలీసులు పరిశీలించారు. ఇద్దరు వ్యక్తులు ముసుగులు ధరించి ప్లాట్‌లోని వెళ్లినట్టు గుర్తించారు. కాసేపటి తరువాత యువతితో ఇద్దరు ముసుగు వ్యక్తులు కూడా బయటకు వచ్చినట్టు గుర్తించారు. యువతి అమృతా చౌహాన్(21) గుర్తించారు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకొని పోలీసులు తనదైన శైలిలో ప్రశ్నించడంతో నిజాలు బయటకు వచ్చాయి. అమృతా చౌహాన్(21), రామ్‌కేశ్‌తో సహజీవనం చేస్తోంది. ప్రైవేటు వీడియోలన రికార్డు చేసి ల్యాప్‌ట్యాప్‌లో రామ్‌కేశ్ భద్రపరుచుకున్నాడు.
ఈ వీడియోలను డిలీట్ చేయాలని పలుమార్లు రామ్‌కేశ్‌ను కోరింది. అతడు చేయకపోవడంతో ప్రియుడ్ని చంపాలని నిర్ణయం తీసుకుంది. మాజీ ప్రియుడు అమృత, మరో స్నేహితుడు సందీప్‌తో కలిసి హత్య ప్రణాళిక రచించింది. అక్టోబర్ 5న రామ్‌కేశ్ ప్లాట్‌కు సుమిత్, సందీప్ చేరుకొని తలపై బలంగా కొట్టారు. అతడిపై నూనె, నెయ్యి, వైన్ పోశారు. వంటింట్లోనే గ్యాస్ సిలిండర్‌నో నాబ్ ఓపెన్ చేసి రామ్‌కేళ్ తల దగ్గర పెట్టారు. గ్యాస్ రూమ్ అంత వ్యాపించన తరువాత లైటర్‌ను వెలిగించా అక్కడి వెళ్లిపోయారు. వాళ్లు వెళ్లిన తరువాత గ్యాస్ సిలిండర్ పేలడంతో అగ్ని ప్రమాదంలో చనిపోయాడని శవ పరీక్షలో తేలింది. అమృత ఫోరెన్సిక్ స్టూడెంట్ కావడంతో తన తెలివితేటలను ఉపయోగించి తప్పించుకోవాలని చూసింది. సుమిత్ వంట గ్యాస్ డిస్ట్రిబ్యూషన్‌లో పని చేస్తుండడంతో అంత ఎంతసేపు పేలుతుంది అనే దానిపై అతనికి అవగాహన ఉంది. సిసిటివి ముగ్గురు నిందితులను పట్టించింది. ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. హార్డ్‌డిస్క్‌లో 15 మంది ప్రైవేటు వీడియోలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. మహిళల అనుమతి లేకుండా వీడియోలు తీయడంతో హార్డ్‌డిస్క్‌లో స్టోర్ చేసే అలవాటే అతడి ప్రాణం తీసింది.




