
మన తెలంగాణ/హైదరాబాద్ : సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల మరమ్మతులకు సంబంధిత ఏజెన్సీలే బాధ్యత వహించేలా చూడాలని, వాటి మరమ్మత్తుల కో సం అవసరమైన ప్రణాళికలు సిద్ధం చే యాలని అధికారులను సిఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం నీటిపారుద ల శాఖపై సిఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈసమీక్షలో మంత్రి ఉత్తమ్, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, సెక్రట రీ మాణిక్‌రాజ్, నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భం గా ఇటీవల సిఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ పంపిన లేఖపై ఉన్నతాధికారులతో సిఎం సమీక్షించారు. ఈ లేఖలో కేంద్రమంత్రి ప్రస్తావించిన అంశాలను అధికారులకు సిఎం రేవంత్ రెడ్డి వివరించారు. వాటిపై ఏ విధంగా ముందుకెళ్లాలన్న అంశంపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ లేఖలో పేర్కొన్న ప్రాజెక్టులకు సంబంధించి విశ్లేషణలు చేసి పూర్తిస్థాయి నివేదికలను త యారు చేయాలని అధికారులను సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ‘
అలాగే రాష్ట్రంలోని అన్ని డ్యామ్‌లపై స్టేటస్ రిపోర్ట్ త యారు చేయాలని సిఎం రేవంత్‌రెడ్డి అధికారులను సూచించారు. ప్రాజెక్టుల వారీ గా పూర్తిస్థాయి నివేదికల ఆధారంగా త దుపరి తీసుకోవాల్సిన చర్యలపై నవంబర్ రెండో వారంలో మరోసారి సమీక్ష సమావేశం నిర్వహించాలని సిఎం నిర్ణయించా రు. ఈ సమీక్షలో తుమ్మిడిహట్టి వద్ద చేపట్టాల్సిన ప్రాజెక్టుపై సిఎం చర్చించారు. తమ్మిడిహట్టి నుంచి సుందిళ్ల వరకు 80 టిఎంసీల నీటిని తరలించేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగు నీరు, త్రాగునీరు అందించేందుకు ప్రణాళికలు రూపొందించాలని, దీనికోసం పాత పనులను ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్లేందుకు అంచనాలను తయారు చేయాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. సుందిళ్లను రిపేర్ చేసి వినియోగంలోకి తీసుకొచ్చి శ్రీపాద ఎల్లంపల్లికి నీటిని తెచ్చేందుకు అవసరమైన ప్రణాళికలు, అంచనాలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు.




