Sunday, November 23, 2025
Google search engine
HomeUncategorizedమొంథా తుపాను.. తెలంగాణలో భారీ వర్షాలు

మొంథా తుపాను.. తెలంగాణలో భారీ వర్షాలు

కాకినాడ వద్ద సాయంత్రం తీరం దాటే అవకాశం

ఆ సమయంలో 110 కి.మీ వేగంతో ఈదురు గాలులు

శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు భారీ వర్షాలు

1419 గ్రామాలపై తుఫాన్ ప్రభావం

తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు

వాతావరణశాఖ హెచ్చరికలు

మన తెలంగాణ/హైదరాబాద్ : నైరుతి, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మొంథా తుపాను గడిచిన 6 గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదిలిందని ఎపి రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది ప్రస్తుతానికి చెన్నైకి 420 కిలోమీటర్ల, విశాఖపట్నానికి 450 కిలోమీటర్లు, కాకినాడకి 500 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించారు. మొంథా తుపాను ఉత్తర – వాయువ్య దిశగా ప్రయాణిస్తూ మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా బలపడుతుందని చెప్పుకొచ్చారు.

మంగళవారం సాయంత్రం లేదా రాత్రి సమయంలో మచిలీపట్నం, కాకినాడ మధ్య తీరాన్ని తుపాను దాటే అవకాశం ఉందని వివరించారు. తుపాను తీరం దాటే సమయం లో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల. వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొన్నారు. తుపాను ప్రభావంతో మంగళవారం కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు, శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అత్యంత భారీ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని ప్రఖర్ జైన్ సూచించారు మొంథా తుపాను 233 మండలాల్లోని 1419 గ్రామాలు , 44 మున్సిపాలిటీల్లో ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే 2194 రిలీఫ్ క్యాంపులు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. ప్రభుత్వ యం త్రాంగం ప్రజలతో ఉందని.. ఎలాంటి భయాందోళనలకు గురికావొద్దని సూచించారు. సహాయక చర్యల కోసం 11 ఎన్డీఆర్‌ఎఫ్, 12 ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు జిల్లాల్లో ఉన్నాయని, మరికొన్ని బృందాలు హెడ్ క్వార్టర్స్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

తెలంగాణలో భారీ వర్షాలు

మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్రానికి మరో మూడు రోజులు అత్యంత భారీ వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బంగాళాఖా తంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మొంథా తుపానుగా మారిందని అధికారులు తెలిపారు. హైదరాబాద్, అక్టోబరు27 మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్రానికి మరో మూడు రోజులు అత్యంత భారీ వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మొంథా తుపానుగా మారిం దని వెల్లడించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments