
మన తెలంగాణ/ హైదరాబాద్: గృహ కొనుగోలుదారులతో జరిగిన మోసంతో సంబంధం ఉన్న పిఎంఎల్‌ఎ కేసులో సాహితీ ఇన్‌ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, దాని మాజీ డైరెక్టర్ సందు పూర్ణచంద్రరావు, అతని కుటుంబ సభ్యులకు చెందిన రూ.12.65 కోట్ల విలువైన చరాస్తు లను ఇడి జప్తు చేసిందని శుక్రవారం ఒక అధికారి తెలిపారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్ జోనల్ కార్యాలయం పిఎంఎల్‌ఎ, 2002 కింద చరాస్తులను జప్తు చేసిందని, ఈ కేసులో ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ రూ.174.15 కోట్లుగా ఉందని అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.ఎస్‌ఐవిఐపిఎల్ మేనేజింగ్ డైరెక్టర్ బూదతి లక్ష్మీనారాయణను గత సంవత్సరం సెప్టెంబర్‌లో రూ.1,000 కోట్లకు పైగా మనీలాండరింగ్ నిబంధనల కింద ఇడి అరెస్టు చేసింది. డిసెంబర్ 2023లో ఇడి ఎస్‌ఐవిఐపిఎల్, దాని మేనేజింగ్ డైరెక్టర్, దాని మాజీ డైరెక్టర్, ఎస్. పూ ర్ణచంద్రరావు, వారి కుటుంబ సభ్యులు, సంబంధిత సంస్థలు, ఒమిక్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌కి చెందిన రూ.161.50 కోట్ల విలువైన చరాస్తులను అటాచ్ చేసింది. జనవరి 2024లో హైదరాబాద్ పోలీసులు 1,752 మంది కస్టమర్లను మోసం చే యడానికి కుట్ర ఆరోపణలపై లక్ష్మీనారాయణ, మరో 21మందిపై కేసు నమోదు చేశారు.




