
సమస్తిపూర్/బెగుసరాయ్ : ఎన్‌డిఎ మళ్లీ అధికారంలోకి వ చ్చినా నితీశ్ కుమార్ మళ్లీ సిఎం కాబోరని, బిజెపి ఆయన పట్ల సుముఖంగా లేదని ఆర్‌జెడి నేత తేజస్వీ యాదవ్ ప్రకటన చేసిన గంటల వ్యవధిలో ప్రధాని మోడీ ఆ విమర్శలకు తెరదించారు. నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్‌డిఎ కూట మి బీహార్ ఎన్నికల్లో గత రికార్డులన్నీ ఈసారి తిరగరాయబోతోందని అన్నారు. తద్వారా ఆయనే మళ్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రధాని మోడీ స్పష్టతనిచ్చారు. ఈ సందర్భం గా నితీశ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. నితీశ్ 2005లో అధికారంలోకి వచ్చారని, సుమారు దశాబ్దం పాటు అధికారంలో ఉన్న అప్పటి యూపీఏ ప్రభుత్వం ఆయన సర్కార్ ను నానా ఇబ్బందులకు గురిచేసిందన్నారు. బహిరంగ సభ కు వచ్చిన ప్రజలందరు తమ చేతుల్లోని ఫోన్ లైట్లను వెలిగించాలని కోరిన మోడీ వాటిని చూపిస్తూ బీహార్ ఇలా వెలిగిపోతుంటే ఇంకా లాంతరు(ఆర్‌జెడి ఎన్నికల గుర్తు) వెలుగులు ఇంకా మనకెందుకని కోరారు.
ఆధునిక పరికరాల కాలంలోనూ పురాతన లాంతరు ఎందుకని ప్రశ్నించారు. అక్టోబర్ 2005లో మీ తల్లిదండ్రులు బీహార్‌లో జంగిల్‌రాజ్‌కు మంగళం పలికారని, ఇప్పుడు సుపరిపాలన అందిస్తు న్న ప్రభుత్వాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మీపై ఉందని యు వ ఓటర్లకు పిలుపునిచ్చారు. గుజరాత్, మధ్యప్రదేశ్, హ ర్యానాలో ఎలాగైతే తిరిగి అధికారాన్ని ఎన్‌డిఎ నిలబెట్టుకుందో బీహార్‌లో కూడా అదే పునరావృతం కాబోతోందన్నారు. మహాఘట్బంధన్‌ను ఈ సందర్భంగా మోడీ మహాలాఠ్‌బంధన్ (అధికారం కోసం ఒకరినొకరు లాఠీలతో కొ ట్టుకునే కూటమి)గా మోడీ అభివర్ణించారు. జంగిల్ రాజ్ హయాంలో మహిళలు వేధింపులను ఎదుర్కొన్నారని, తిరి గి అలాంటి పరిస్థితిని తెచ్చుకోవద్దని పిలుపునిచ్చారు. ఆర్‌జెడి, కాంగ్రెస్ మీ సమస్యలను ఒక్కటి కూడా తీర్చలేని పరిస్థితిలో ఉందన్నారు. ఒకప్పుడు ఇతర రాష్ట్రాలపై ఆధారపడే బీహార్ ఇప్పుడు స్వయం సమృద్ధిదశకు చేరుకుందని, తిరి గి దయనీయ పరిస్థితుల్లోకి నెట్టివేసుకోవద్దని, సుపరిపాలన కు పట్టం కట్టాలని ఓటర్లకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.




