
మనతెలంగాణ/ సిటీబ్యూరో ః జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో 58 మంది పోటీలో నిలిచారు. స్క్రూటినీలో 81 మంది నామినేషన్‌లు ఆమోదం పొందగా, 23 మంది వారి నామినేషన్‌లను ఉపసంహరించుకున్నారు. దీంతో ఉప ఎన్నికల బరిలో 58 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. నవంబర్ 11న పోలింగ్ జరుగుతుందనీ, నవంబర్ 14వ తేదీన ఫలితాలు వెలువడుతాయని, 16వ తేదీ వరకు ఎన్నికల కోడ్ ఉంటుందని అభ్యర్థుల సమక్షంలోనే వారికి గుర్తింపు పొందిన పార్టీలకు వారి గుర్తులు కేటాయించడంతో పాటు స్వతంత్ర అభ్యర్థులకు కూడా గుర్తులు కేటాయించనున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసి కమిషనర్ ఆర్‌వి కర్ణన్ వెల్లడించారు. జీహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఈఓ మాట్లాడుతూ.. కర్ణన్ తెలిపారు.
2.83 కోట్ల నగదు సీజ్..
నగదు సీజు రూ. 2,83,83,590లు, మద్యం 512.375 లీటర్లు, డ్రగ్స్ వంటివి 0.197 కిలోల గాంజా, 0.011 గ్రాంల ఎండిఎంఏ, రూ. 1,37,840 విలువజేసే ఇతర వస్తువులను సీజ్ చేసినట్టు కర్ణన్ తెలిపారు. ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు ఉప ఎన్నికల ప్రక్రియను ఎప్పటికప్పుడు తనిఖీలు చేయడం జరుగుతుందని కర్ణన్ వెల్లడించారు. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడి యం, యూసుఫ్‌గూడలో ఓట్ల లెక్కింపు జరుగుతుందని, 19 మంది నోడల్ అధికారులను నియమించినట్టు కర్ణన్ తెలిపారు. ఓటరు స్లిప్పుల పంపిణీ కార్యక్రమం నవంబర్ 5వ తేదీలోపు పూర్తవుతుందన్నారు. 38 సెక్టార్లకుగానూ 55 మంది సెక్టార్ అధికారులను, పోలింగ్ అధికారులు 600, అసిస్టెంట్ పో లింగ్ అధికారులు 600, ఓపిఓలు 1200 మం దితో మొత్తం 2400 మంది ఎన్నికల ని ర్వహణకు నియమించినట్టు కర్ణన్ తెలిపారు.




