
మన తెలంగాణ/హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ఇప్పటికే సర్వీసులో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నుంచి మి నహాయింపు ఇవ్వాలన్న విజ్ఞప్తిని నేషనల్ కౌ న్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్(ఎన్‌సిటిఇ) తిరస్కరించింది. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు ఉ ద్యోగంలో కొనసాగాలంటే టెట్ పాస్ కావాలని సుప్రీంకోర్టు సెప్టెంబర్ 1న తీర్పును వెలువరించింది. తీర్పు ఇచ్చిన తర్వాత రెండేళ్లలో అంటే 2027 నాటికి టెట్ ఉత్తీర్ణులు కావాలని పేర్కొం ది. అయితే ఐదేళ్లలో పదవీ విరమణ చేయబోయేవారికి మాత్రమే టెట్ అవసరం లేదని పేర్కొంది. అయితే వారు పదోన్నతి పొందాలంటే మాత్రం టెట్ పాసవ్వాలని తెలిపింది.
విద్యాహక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి టెట్ తప్పనిసరి చేస్తూ 2010 ఆగస్టు 23వ తేదీన ఎన్‌సిటిఇ ఉత్తర్వులు జారీచేసింది. అప్పటికే సర్వీసులో ఉన్నవారికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం టెట్ మినహాయింపును ఇచ్చింది. టెట్ పరీక్షను 2010 నుంచి నిర్వహిస్తూ వస్తున్నారు. 2010 తర్వాత నియామకమైన ఉపాధ్యాయులందరూ టెట్ ఉత్తీర్ణత సాధించి ఉన్నారు. అంతకుముందు నియమితులై సర్వీసులో కొనసాగుతున్న వారిలో కొందరు మాత్రమే టెట్ ఉత్తీర్ణత సాధించగా, మరికొందరు టెట్ ఉత్తీర్ణత సాధించాల్సి




