Sunday, November 23, 2025
Google search engine
HomeUncategorizedపత్తి కొనుగోలు షురూ

పత్తి కొనుగోలు షురూ

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మం గళవారం నుంచి పత్తి కొనుగోలు ప్రారంభమైనట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సచివాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ మొత్తం 317 జి న్నింగ్ మిల్లులను కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇం డియా (సీసీఐ) నోటిఫై చేసిందని అన్నారు. బు ధవారం ఖమ్మం జిల్లా, 24న నల్గొండ జిల్లాలో ప్రారంభం కానున్న పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభమవుతాయని- మంత్రి స్పష్టం చేశారు. ఇతర జిల్లాల్లో కూడా వెంటనే సీసీఐ కేంద్రాలను ప్రారంభించాలని ఆదేశించారు. 24 గం టల్లో రైతుల సమస్యకు పరిష్కరించే విధంగా ఒ క సీనియర్ అధికారితో పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. సీసీఐ తీసుకొచ్చిన కపాస్ కిసాన్ యా ప్ ద్వారా ఇప్పటి వరకు 21,07,272 మంది రైతులు రిజిస్టర్ చేసుకున్నారని, దీంతో వారు అనుకూలమైన సమయం చూసుకొని వారి

పంటను అమ్ముకోవడానికి స్లాట్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా మంత్రిగా విజ్ఙప్తి మేర కు రైతులు తమ ఫోన్ నెంబర్‌ను అప్ డేట్ చేసుకునే వెసులుబాటును తెలంగాణ రాష్ట్రంలో సీసీ ఐ కల్పించిందని తెలిపారు. దీంతో రైతుల మొ బైల్ నెంబర్ అప్ డేట్ చేసేందుకు వ్యవసాయ శాఖ ఏ.ఈ.ఓ యాప్ లాగిన్‌లో ప్రత్యేక ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చిందని, తమ పరిధిలోని ఏఈఓ సంప్రదించి మొబైల్ నెంబర్ ను అప్డేట్ చేసుకోవచ్చని, దీని ద్వారా మరుసటి రోజు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చునని మంత్రి వివరించారు. రైతుల సౌకర్యార్థం టోల్ ఫ్రీ నెంబర్ 1800-599-5779ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. దీని ద్వారా తమ సందేహాలు లేదా ఫిర్యాదులను నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. 24 గంటలలో వారి ఫిర్యాదులను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులకు మంత్రి ఆదేశించారు.

ఈ హెల్ప్ లైన్ నెంబర్లు ఉదయం ఏడు గంటల నుండి రాత్రి 9 వరకు పనిచేస్తాయని తెలిపారు. కాగా ఈ ఆర్థిక సంవత్సరం 2025-.26లో రూ.48.54 కోట్లతో జాతీయ ఆహార భద్రత పథకాన్ని అమలు చేస్తున్నామని, విత్తనాలతో పాటు ప్రదర్శన క్షేత్రాలు, విత్తనోత్పత్తి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతు వేదికల వద్ద రైతులను సమీకరించి ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ పథకాలు, రైతులకు లబ్ది కలిగించే పూర్తి సమాచారాన్ని పక్కాగా అందించాల్సిన బాధ్యత డిఏఓ, ఏఓ, ఏఈఓలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకు అవసరమైన శాస్త్రవేతలను, వ్యవసాయ నిపుణలను ఆహ్వానించి రైతులకు వ్యవసాయ ఉత్తత్తులకు, మార్కెటింగ్‌పై అవగాహన కల్పించాలని కూడా ఆదేశించారు. మంగళవారం సెక్రటేరియట్‌లో రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జాతీయ ఆహార భద్రతా పథకం కింద నాణ్యమైన పప్పుదినుసుల వంగడాలను, పొద్దుతిరుగుడు, కుసుమ వంగడాలను సబ్సిడీ మీద రైతులకు అందచేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు నేస్తం కార్యక్రమానికి సంబంధించిన ముందస్తు సమాచారం రైతులకు అందివ్వాలని అన్నారు. తదుపరి రైతు నేస్తం కార్యక్రమానికి రైతు వేదికలలో రైతులను పూర్తి స్థాయిలో హాజరయ్యే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

మేలైన పప్పుదినుసుల వంగడాల విత్తనాలు పంపిణీ

రైతు నేస్తం కార్యక్రమం సందర్భంగా జాతీయ ఆహార భద్రతా పథకంలో మేలైన పప్పుదినుసుల వంగడాల విత్తనాలను మంత్రి తుమ్మల పంపిణీ చేశారు. ఒక్కొక్క పథకాన్ని తిరిగి పునరుద్ధరిస్తామని చెప్పిన మేరకు గతవారం జాతీయ నూనె గింజల మిషన్‌ను – మంత్రి తుమ్మల ప్రారంభించారు. ఇప్పటికే వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఈ పథకంలో భాగంగా ఈ యాసంగిలో 2.68 కోట్ల సబ్సిడీతో 49,397 ఎకరాలకు సరిపడా 5825 క్వింటాళ్ల శనగ విత్తనాలు 14 జిల్లాలలో పంపిణీకి వ్యవసాయశాఖ ఏర్పాట్లు చేసిందని మంత్రి తెలిపారు. గత సీజన్‌లో జిల్లాకు ఎంపిక చేసిన ఒక మండలంలో 1,39,000 మట్టి నమూనాలు సేకరించి, వాటి విశ్లేషణ పూర్తి చేసి ఫలితాలు రైతులకు అందచేయడానికి ఏర్పాట్లు చేయాలని, త్వరలో ఇంకో 1,70,000 మట్టి నమూనా ఫలితాలు అందుతాయని – మంత్రి తుమ్మల వివరించారు. నేచురల్ ఫార్మింగ్‌కు అత్యంత ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం – మంత్రి తుమ్మల ఇప్పటికే క్లస్టర్ల గుర్తింపు, శిక్షణ పూర్తి – చేస్తామని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.

గత పదేళ్లలో రైతులు దాదాపు రూ. 3వేల కోట్లు నష్టపోయారు

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేంద్ర రాష్ట్ర వాటాలతో అమలు అయ్యే పథకాలన్నింటినీ ఒక్కొక్కటిగా పునరుద్ధరిస్తూ, గరిష్ట స్థాయిలో రైతుల ప్రయోజనం చేకూరేలా వ్యవసాయ, ఉద్యాన శాఖలు చర్యలు చేపట్టాయని మంత్రి చెప్పారు. గత ప్రభుత్వం రాష్ట్ర వాటా విడుదల చేయకపోవడంంతో రాష్ట్ర రైతాంగం గత పదేళ్లలో దాదాపు రూ.3 వేల కోట్ల మేర నష్టపోయిందని, కేంద్ర ప్రభుత్వాలు కూడా రాష్ట్రానికి కేటాయించిన అట్టి నిధులను తిరిగి అవే రాష్ట్రాలకు తరువాత కేటాయిస్తే కనీసం రాష్ట్రాల ప్రాథమిక హక్కులను, ఆయా రాష్ట్రాల రైతలు ప్రయోజనాలను కాపాడే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించినట్లు ఉండేదని అన్నారు. కానీ అలా చేయకపోవడంతో

అప్పటి ప్రభుత్వ రాజకీయ దురుద్దేశాలకు రైతులు నష్టపోయాయరని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులను పూర్తి స్థాయిలో వాడుకోవాలని, దానికి తగ్గ రాష్ట్రవాటా నిధులు విడుదల చేసి మన రాష్ట్ర రైతులకు ఆర్థికాభివృద్ధికి పాటుపడాలని కృతనిశ్ఛయంతో ఉన్నారని మంత్రి తుమ్మల తెలిపారు. రైతుల ప్రయోజనాలే ప్రజా ప్రభుత్వానికి పరమావధి అని తెలిపారు. దానికి తగ్గట్లు ఆర్థిక వెసులుబాటు రాగానే ఒక్కొక్క పథకాన్ని పునరుద్ధరిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో వరితో పాటు పప్పుదినుసులు, నూనె గింజల సాగును కూడా పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. గతవారం పంపిణీ చేసిన వేరుశనగతో పాటు, పొద్దుతిరుగుడు 83.78 క్వింటాళ్ల హైబ్రిడ్ విత్తనాలను, 74 క్వింటాళ్ల కుసుమ విత్తనాలకు 45.41 లక్షల మొత్తాన్ని వినియోగించి సరఫరా చేయాలని నిశ్చయించినట్లు పేర్కొన్నారు.

మొక్కజొన్న కొనుగోలు ప్రారంభం

మద్ధతు ధర ప్రకటించి మొక్కజొన్న పంటను కేంద్రం కొనకుండా వదిలేసిందని మంత్రిగారు కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి విమర్శించారు. కాని రైతుల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న పంటను ఇప్పటికే కొనుగోలు చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో 6,24,000 ఎకరాలలో మొక్కజొన్న పంట సాగైనట్టు, ఎకరానికి 18.50 క్వింటాళ్ల చొప్పున మొత్తం 11,55,000 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న పంట ఉత్పత్తి అయ్యే అవకాశం ఉన్నట్టు అంచనా వేసినట్లు చెప్పారు. ఈ మొక్కజొన్న కొనుగోళ్ల కోసం 204 సెంటర్లు ప్రతిపాదించగా, ఇందులో 100 సెంటర్లు ప్రారంభమైనట్లు తెలిపారు. దీనిలో 30 సెంటర్ల ద్వారా 220 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలను కొనుగోలు చేసినట్టు మంత్రి వివరించారు. మిగతా సెంటర్లను కూడా త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments