
పాట్నా : బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి ఎలాగైనా కషాయిదళానికి చెక్ పెట్టాలన్న ల క్ష్యంతో బరిలోకి దిగిన మహా ఘట్‌బంధన్‌లో చిచ్చురేగింది. పకడ్బందీగా 243 స్థానాలకు పోటీ విషయంలోఆర్జేడీ, కాంగ్రె స్ మిత్రపక్షాల మధ్య ఏకాభిప్రా యం సాధ్యం కాలేదు. ఫలితం గా కూటమిలోని పార్టీలు 11 స్థానాల్లో తమలో తామే ప్రత్యక్షంగా పోటీ పడుతున్నారు. ఇది ప్రతిపక్షాల కూటమిలో అంతర్గత కుమ్ములాటను తేటతెల్లంచేసింది. బీహార్ ఎన్నికల మొదటిదశ పోలింగ్ జరగడానికి ఇక 15 రో జులే గడువు ఉన్నా, ప్రతిపక్ష శ్రేణుల్లో గందరగో ళం సద్దుమణగపోవడంతో ఎన్డీఏ భాగస్వామి పార్టీలైన బీజేపీ, జేడీయూ, చిరాగ్ పాశ్వాన్ ఈ అంశాన్ని ప్రచార అస్త్రంగా వినియోగించుకుంటున్నాయి. పోటీ దశలోనే ఏకాభిప్రాయం రాలేని పార్టీలు అధికారంలోకి వస్తే..కీచులాటలు తప్పవ ని ఆ పార్టీలు హెచ్చరిస్తున్నాయి. ఆర్జేడీ, కాంగ్రెస్ ఆరు స్థానాల్లో పరస్పరం పోటీ పడుతుండగా, సిపిఐ, కాంగ్రెస్ నాలుగు నియోజకవర్గాల్లో తలపడుతున్నాయి. ముఖేషి సహానీకి చెందిన వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ, (విఐపీ), ఆర్జేడీ మరో రెండు స్థానాల్లో ఫ్రెండ్లీ ఫైట్ కు సిద్ధమవుతున్నాయి. సోమవారం నాడు ఆర్జేడీ 143 మంది అభ్యర్థుల జాబితా ప్రకటించింది. ఇందులో కాంగ్రెస్ పోటీ కూడా అభ్యర్థులను నిలబెట్టిన ఆరు స్థానాలు ఉ న్నాయి. అవి వైశాలి, సికంద్ర, కహల్గావ్, సుల్తాన్ గంజ్, నర్కటియా గంజ్, వార్సలి గంజ్. కాగా, కాంగ్రెస్- సిపిఐ కూడా
బచ్వారా, రాజపాకర్, బీహార్ షరీఫ్, కార్ఘర్లలో ఫ్రెండ్లీ పైట్ కు ఒకరిపై ఒకరు అభ్యర్థులను నిలబెట్టాయి. నవంబర్ 6న మొదటిదశ ఎన్నికలు జరిగే స్థానాల్లో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది. కానీ, బచ్వారా, రాజ పకార్, బీహార్ షరీఫ్ స్థానాలకు మహా గట్బంధన్ మిత్రులలో ఎవరూ తగ్గలేదు. దీంతో వారి మధ్య పోటీ అనివార్యమైంది. అక్టోబర్ 23న రెండోదశ పోలింగ్ కు వెళ్లే స్థానాల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. అప్పడు మొత్తం ఎవరెవరు ప్రత్యక్ష ఘర్షణకు దిగుతున్నారో స్పష్టమవుతుంది. గట్బంధన్ పార్టీల అంతర్గత ఘర్షణలు ప్రతిపక్ష ఓట్లను చీల్చడంతో పాటు అనేక నియోజకవర్గాల్లో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమికి ప్రయోజనం కలిగే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.




