
కన్న బిడ్డలను చంపి అనంతరం ఆత్మహత్యకు పాల్పడింది ఓ మహిళ. ఈ దారుణం సంఘటన నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సోమవారం తెల్లవారుజామున కొండమల్లేపల్లిలో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలను చంపి.. తర్వాత ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.
మృతులను బాపట్ల జిల్లాలోని జనకవరం గ్రామానికి చెందిన కుంచాల నాగలక్ష్మి(27) తన ఇద్దరు చిన్నారులు.. అవంతిక (9), భవన్ సాయి (7)గా పోలీసులు గుర్తించారు. ఫ్యామిలీలో గొడవల కారణంగానే నాగలక్ష్మీ తన ఇద్దరు పిల్లలను చంపి, ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




