Sunday, November 23, 2025
Google search engine
HomeUncategorizedసోమవారం రాశి ఫలాలు (20-10-2025)

సోమవారం రాశి ఫలాలు (20-10-2025)

మేషం – మీకు అండగా నిలబడతారని ఆశించిన ఓ వర్గం వారు సకాలంలో అందుబాటులో లేకపోవడం లోటుగా పరిణమిస్తుంది. మీలో మొండితనం పట్టుదల అధికమవుతున్నట్లుగా భావిస్తారు.

వృషభం – కార్యాలయంలో ఉన్నతాధికారుల మెప్పు లభిస్తుంది. నూతనమైన బ్యాంక్ అకౌంట్లను ప్రారంభిస్తారు. వాయిదా పడుతూ వస్తున్న విషయాలలో తెగించి నిర్ణయాలను తీసుకుంటారు.

మిథునం – సాంప్రదాయాలకు విలువని ఇచ్చి ఆధునిక పోకడలకు దూరంగా ఉంటారు మంచి వ్యక్తిగా సమాజంలో గుర్తింపు పొందడానికి కావలసిన విధంగా నడుచుకుంటారు. సంఘంలో గౌరవం లభిస్తుంది.

కర్కాటకం – ఓర్పు సహనాల విలువ తెలిసి వస్తుంది. సంతాన అవసరాలపైన దృష్టిని సారిస్తారు. వారి అవసరాలను దృష్టిలో ఉంచుకొని తగు వసతులు కల్పించడానికి కృషి చేస్తారు.

సింహం – పరపతి కలిగిన సమాజంలోని ఉన్నత స్థాయి వ్యక్తులతో సంప్రదింపులు జరిపి లాభపడతారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు.మీకు నచ్చిన వ్యక్తులతో ఆనందంగా గడుపుతారు

కన్య – ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. రుణాలను కొంతవరకు తీర్చగలుగుతారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. కుటుంబ సమస్యల నుండి బయటపడతారు.

తుల – సోదరుల నుండి వస్తు లాభాలు పొందుతారు. వివాహ ఉద్యోగయత్నాలు కలిసి వస్తాయి. అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఇతరుల విషయంలో జోక్యం వద్దు. కోపతాపాలకు దూరంగా ఉండండి.

వృశ్చికం – బంధువులు మిత్రులు నుండి శుభవార్తలు వింటారు. నూతన గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతతి విషయమై చింతించవలసిన అవసరం లేదని గ్రహించి ఊపిరి పీల్చుకుంటారు.

ధనుస్సు – అనుకొని అవకాశాలు కలిసి వస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోండి. ఎలర్జీ, అజీర్తి వంటి స్వల్ప ఇబ్బందుల పట్ల అప్రమత్తంగా ఉండటం చెప్పదగినది. మొండి పట్టుదల ఉపకరించేది కాదని గ్రహించండి.

మకరం – ఆర్థిక లావదేవిలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. గతంలో అమ్మే ఉద్దేశంతో కొన్న స్థలాన్ని ఇప్పుడు అమ్మకానికి పెడతారు.ఈ విషయము గురించి కుటుంబ సభ్యులతో సమాలోచనలు సాగిస్తారు.

కుంభం – సభలు సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. పాత బాకీలు వసూలు అవుతాయి. ఎంతసేపు ఎదుటివారు మీకు హితం చెప్పడమే కానీ మీరు చెప్పేది కనీసం వినని వ్యక్తుల వలన చికాకు కలుగుతుంది.

మీనం – రొటీన్స్ సంతకాలు, అగ్రిమెంట్లు, ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో ఆలోచించి నిదానంగా నింపాదిగా వ్యవహరించండి. మిత్ర బృందంలోని ఒకరు మీతో శత్రుత్వం పెంచుకునే సూచనలు ఉన్నాయి.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments