
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి సంబంధించిన నిధులు విడుదలయ్యాయి. 28 కోట్ల 43 లక్షల 76 వేలు (రూ.8,43,76,000) నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నిధులు 2025 -26 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 2025 వరకు, జూన్, జూలై 2025లకు సంబంధించిన వంట ఖర్చులు, పెండింగ్ బిల్లుల చెల్లింపుకు సంబంధించి అని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ వెల్లడించారు. జిలా విద్యాశాఖ అధికారులు ఎంఇఒలకు నిధులు మంజూరు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కింద 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు సరఫరా చేసే గుడ్ల ఖర్చుకు సంబంధించి పెండింగ్ బిల్లుల చెల్లింపునకు ప్రభుత్వం తాజాగా నిధులు విడుదల చేసింది. 2025 -26 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, జూన్, జులై నెలలకు సంబంధించి 25 కోట్ల 64 లక్షల 91 వేలు నిధులు చేస్తూ నవీన్ నికోలస్ ఉత్తర్వులు చేశారు.




