
కానిస్టేబుళ్ల ఫై దొంగ కత్తి తో చేసిన ఘటనలో ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ ఘటన నగరంలో వినాయక్ నగర్ లో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. నగరంలోని హస్మి కాలనీ కి చెందిన ఓ నేరస్తుడు దొంగతనం కేసులో అనుమానితుడిగా భావించిన సీసీఎస్ కానిస్టేబుళ్లు విఠల్, ప్రమోద్ లు అదుపులోకి తీసుకోని బైక్ మీద శుక్రవారం సీసీఎస్ స్టేషన్ కు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో సదురు అనుమానితుడు ఇద్దరు కానిస్టేబుళ్ల మీద కత్తి తో దాడి చేసి పారిపోయడు. కానిస్టేబుళ్లు ప్రమోద్ విఠల్ లకు గాయాలు కావడంతో వారిద్దరిని హుటాహుటిన చికిత్స కోసం ఆసుపత్రి కి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ ప్రమోద్ చికిత్స పొందుతూ చనిపోయినట్లుగా ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. మరో వైపు పారిపోయిన నిందితుడి కోసం గాలింపు జరుపుతున్నారు.




