
అంతరిక్ష రంగ అభివృద్ధి కోసం ప్రస్తుతం ఇస్రో అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టినట్టు ఇస్రో చీఫ్ వి. నారాయణన్ వెల్లడించారు. వాటిలో 80 వేల కేజీలను మోసుకెళ్లే రాకెట్లను తయారు చేయడం , 2026 లో వ్యోమమిత్ర అనే రోబోను అంతరిక్షం లోకి పంపడం , 2035 నాటికి జాతీయ అంతరిక్షకేంద్రం ,చంద్రుడిపై అధ్యయనం కోసం వీనస్ ఆర్బిటర్ మిషన్ ఏర్పాటు , వంటి లక్షాలను ఏర్పర్చుకున్నామన్నారు. అంతరిక్ష మిషన్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , రోబోటిక్స్ బిగ్ డేటా వంటివాటిని ఉపయోగించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. వికసిత భారత్‌కు దూతగా 2040 లో భారతీయ వ్యోమగామి చందమామపై అడుగుపెట్టనున్నాడని నారాయణన్ పేర్కొన్నారు. 2027 లో చేపట్టబోయే మానవ సహిత గగనయాత్ర మిషన్ ట్రాక్‌లో ఉందని వెల్లడించారు. 2040 నాటికి తొలి మానవ సహిత జాబిల్లి యాత్ర చేపట్టాలని ప్రధాని దిశానిర్దేశం చేశారని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారేందుకు అంతరిక్ష కార్యక్రమంలో ఈ యాత్ర కీలకపాత్ర పోషిస్తుందన్నారు.పిటిఐకి ఇచ్చిన ఇంటర్వూలో ఇస్రో ప్రణాళికలను పంచుకున్న వి. నారాయణను గగన్‌యాన్‌లో భాగంగా తాము మరిన్ని ప్రయోగాలకు సిద్ధమవుతున్నట్టుతెలిపారు. చంద్రుడి ఉపరితల నమూనాలను భూమికి తీసుకొచ్చేందుకు 2027లో ప్రతిష్ఠాత్మక చంద్రయాన్4 ప్రయోగాన్ని చేపట్టనున్నట్టు వివరించారు. కొన్నేళ్ల క్రితం అంతరిక్ష రంగంలో రెండు లేక మూడు స్టార్టప్‌లు మాత్రమే ఉండేవని, ప్రస్తుతం ఉపగ్రహ తయారీ, ప్రయోగ సేవలు, అంతరిక్ష ఆధారిత డేటా విశ్లేషణలపై అధ్యయనం కోసం 300 కంటే ఎక్కువ స్టార్టప్‌లు పనిచేస్తున్నాయని ఇస్రో చీఫ్ అన్నారు. వ్యవసాయం, విపత్తు ప్రతిస్పందన , నిర్వహణ, టెలికమ్యూనికేషన్, రియల్ టైమ్‌రైలు , వాహన పర్యవేక్షణలో ఉపగ్రహ ఆధారిత అనువర్తనాల అధ్యయనానికి ఇవి ఉపయోగపడతాయన్నారు.




