
తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ కు సంబంధించిన మద్యం కుంభకోణానికి సంబంధించి దర్యాప్తు ఎంతవరకూ వచ్చిందని సుప్రీంకోర్టు మంగళవారం నాడు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ను ప్రశ్నించింది. మర్చిలో నిర్వహించిన రెండు దాడులపై ఆరు నెలల్లో రెండో సారి కోర్టు దర్యాప్తు సంస్థను ప్రశ్నించింది. వివరణ కోరింది.తమిళనాడు మద్యం కేసులో సుప్రీంకోర్టు పెడరలిజం వాదానికి ఏమైందని ప్రధానంగా ప్రశ్నించింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ ఈడీ ని నిలదీస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి దర్యాప్తు చేసే హక్కును మీరు తీసుకోవడం లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రం నేరాన్ని దర్యాప్తు చేయడం లేదా, మీరే ఆ రాష్ట్రానికి వెళ్లి దాన్ని చేయగలరా అని సీజేఐ ప్రశ్నించారు. విచారణ కొనసాగుతున్న సమయంలో ఇంతకంటే ఎక్కువ వ్యాఖ్యానించడం భావ్యం కాదని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు.ఈ కేసులో మంగళవారం నాడు తమిళనాడు ప్రభుత్వం తరుపున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, ముకుల్ రోహత్గి వాదించారు. ఆరోపించిన నేరాలపై పోలీసులు కేసులు నమోదు చేసినప్పటికీ, ప్రభుత్వరంగ సంస్థపై దాడులు చేసి,
కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఎలా స్వాధీనం చేసుకుంటారని వారు ప్రశ్నించారు. ఇప్పటికే ఆరు ఎఫ్‌ఐఆర్ లు దాఖలు కాగా, ఈడీ ఎందుకు దర్యాప్తులో జోక్యం చేసుకుంటోందని కపిల్ సిబల్ ప్రశ్నించారు. కాగా, రోహత్గీ ప్రశ్నిస్తూ, టస్మాక్ సిబ్బంది గోప్యతా హక్కుకు ఏమైంది. వారు సిబ్బంది మొబైల్ లను ఎలా లాక్ చేసుకుంటారు అని ప్రశ్నించారు.ఈడీ తరుపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు తన వాదన వినిపిస్తూ, రాష్ట్రం ఇప్పటికే 47 పోలీసు కేసులు నమోదు చేసిందని,ఈడీ మనీలాండరింగ్ అంశాన్ని మాత్రమే దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. కపిల్ సిబల్ మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 66(2) ప్రస్తావిస్తూ, దర్యాప్తు సమయంలో మరో చట్టం ఉల్లంఘన జరిగిందని, ఏజెన్సీ కనుకొంటే, తదుపరి చర్య కోసం సంబంధితన అధికారితో ఆ సమాచారం పంచుకోవల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు.




