
ఏడు సంవత్సరాలుగా ప్రే మించాడు గర్బవతిని చేశాడు గర్భం తీయించే ప్రయ త్నం చేసి ఆమె చావుకు కారకుడయ్యాడు. ఈ దారుణమైన స ంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకుల గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు ఇచ్చి న ఫిర్యాదు మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. రంగారెడ్డి జిల్లా షారుఖ్ నగర్ మండలం రా య్‌కల్ గ్రామానికి చెందిన మౌనిక (29) ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతుంది. అయితే శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫింగర్ ప్రింట్ విభాగంలో హొంగార్డు ఉద్యోగం చేస్తున్న ముచ్చింతల్ గ్రామానికి చెందిన మదుసుదన్ (39) తో ఏడు సంవత్సరాల క్రితం పరిచయం ఏర్పడింది. అమెను ప్రేమ పేరుతో లోపరుచుకుని శారీరకంగా వాడుకున్నాడు.
దీంతో అమె నాలుగు రోజుల క్రితం గర్బవతి అయింది. విషయం మధుసుదన్ కు చెప్పడంతో అతను ఎలాగైనా గర్బాని తీయించాలని పథకం వేశాడు. సోమవారం ఉదయం అమెను తీసుకుని పాలమాకుల గ్రామంలోని ఆర్‌ఎంపి డాక్టర్ అయిన పద్మజ వద్దకు తీసుకెళ్లి అబార్షన్ చేయించాడు. దీంతో ఆమెకు తీవ్ర రక్త స్రావం కావడంతో మెరుగైన చికిత్స కోసం నగరంలోని హాస్పిటల్‌కు తరలించే ప్రయత్నం చేశాడు. దీంతో మౌనిక మార్గమధ్యంలో మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న శంషాబాద్ పోలీసులు నింధితుడు మధుసుదన్ తోపాటు అబార్షన్ చేసిన ఆర్‌ఎంపి డాక్టర్ పద్మజలను అరేస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరికి పోలీసులు తరలించారు.




