
ఉక్రెయిన్‌తో యుద్ధం తక్షణం నిలిపివేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని రష్యాకు అమెరికా అధ్యక్షలు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. యుద్దం ఆపండి లేకపోతే తాము అమెరికా దీర్ఘశ్రేణి టోమాహాక్ క్షిపణులను ఉక్రెయిన్‌కు అందిస్తామని, తరువాత వారి ఇష్టం అని ట్రంప్ చెప్పారు. ఇజ్రాయెల్‌కు ప్రత్యేక విమానంలో బయలుదేరిన ట్రంప్ తమ వెంట ఉన్న మీడియాతో మాట్లాడారు. అమెరికా శక్తివంతమైన క్షిపణుల శక్తి ఏమిటనేది రష్యాకు తెలిసిందే అని, యుద్ధం సమసిపోవల్సి ఉంది. లేకపోతే తాము వేరే విధంగ స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
తమ నుంచి ఉక్రెయిన్‌కు అత్యంత కీలక ఆయుధాలు అందుతాయని పరోక్షంగా తెలిపి, రష్యా అధినేత పుతిన్‌పై ఒత్తిడి తెచ్చేందుకు యత్నించారు. తమ క్షిపణి చాలా శక్తివంతం. దీని దెబ్బతినకుండా రష్యా వ్యవహరిస్తుందనే తాను భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్‌స్కీతో ట్రంప్ ఫోన్‌లో అంతకు ముందు మాట్లాడారు. ఈ దశలోనే ఈ మిస్సైల్స్‌ను ఉక్రెయిన్‌కు పంపిచేందుకు మాట ఇచ్చినట్లు వెల్లడైంది. రష్యా వైపు ఈ క్షిపణులు దూసుకువెళ్లాలని పుతిన్ కోరుకుంటున్నాడా? లేదనే అనుకుంటున్నాను. ముందుగా యుద్దం ఆగిపోవాలి.
నానా విధాలుగా తాను పుతిన్‌కు నచ్చచెపుతున్నానని, ఇక ఈ మిస్సైల్ తమ దూకుడుకు మరో అడుగు అని అనుకున్నా ఫర్వాలేదని ట్రంప్ మీడియాతో చమత్కరించారు. ట్రంప్ ప్రస్తావించిన క్షిపణులు గరిష్టంగా 2500 కిలోమీటర్ల దూరం వరకూ, శబ్ధవేగాన్ని మించి దూసుకువెళ్లుతాయి. భూమికి అతి తక్కువ దూరం నుంచి వెళ్లగలిగే వీటిని నౌకల నుంచి చివరికి జలాంతర్గాముల నుంచి కూడా ప్రయోగించే శక్తిసామర్థాలు సంతరించుకుని ఉన్నాయి.




