
మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శనివారం, ఆదివారం వరుస సెలవులు రావడం, వివాహ వేడుకల కారణంతో హైవేపై వాహనాల రద్దీ తీవ్రమైంది. సర్వీస్ రోడ్డు, ఫ్లైఓవర్ నిర్మాణ పనుల వల్ల చిట్యాల, పెద్దకాపర్తి, పంతంగి టోల్ ప్లాజా, చౌటుప్పల్ దగ్గర వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగాయి. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
చౌటుప్పల్ ఏరియాలో వాహనాలు బారులు తీరాయి. పంతంగి టోల్ గేట్ల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు క్లియర్ చేసే పనిలో పడ్డారు. భారీ సంఖ్యలో వచ్చే వాహనాలను త్వరగా పంపించేందుకు టోల్ ప్లాజా దగ్గర ఎక్కువ గేట్ల నుంచి హైదరాబాద్ వైపు వచ్చే వాహనాలను పంపిస్తున్నారు. ఇదిలా ఉండగా, ట్రాఫిక్‌లో అంబులెన్స్ సైతం చిక్కుకు పోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పాలయ్యారు.




