కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక చారిత్రక నిర్ణయమని, మల్లన్నసాగర్ మాజీ సిఎం కెసిఆర్ కష్టార్జితమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా, వట్‌పల్లి గురు కృప పంక్షన్ హాల్‌లో అందోల్ మాజీ శాసనసభ్యుడు క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీలలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కాంగ్రెస్, బిజెపి రెండూ తోడుదొంగలని వ్యాఖ్యాపించారు. ప్రాంతీయ పార్టీ అయిన బిఆర్‌ఎస్, పార్టీ అధినేత మనకు శ్రీరామరక్ష అని అన్నారు. మన వడ్లకు ధర ఉండదు కానీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న గోధుమలకు మాత్రం ఎక్కువ ధర ఉంటుందని ఈ విషయం మన ఎంపిలకు ఎద్దేవా చేశారు. తమ పార్టీ కార్యకర్తలపై కేసులు పెడితే ఉరుకునేది లేదని, ప్రతి ఒక్కరిని రెడ్ బుక్‌లో రాసిపెట్టుకుంటానని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఎల్‌ఎ చింతా ప్రభకార్, జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి, ప్రెస్ అకాడమీ మాజీ ఛైర్మన్ అల్లం నారయణ, జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ బాలయ్య, నాయకులు వీరారెడ్డి, లింగాగౌడ్, కాశినాధ్, ప్రతాప్ లింగాగౌడ్, మాజీ సర్పంచ్ సురేఖ బుద్దిరెడ్డి, అశోక్‌గౌడ్, శివాజీరావు, మారుతీరావు, మధు, ప్రకాశం తదితరులు పాల్గొన్నారు.
కాళేశ్వరం, మల్లన్నసాగర్ కెసిఆర్ కష్టార్జితం:హరీశ్‌రావు
RELATED ARTICLES