హైదరాబాద్: దసర పండగ అంటేనే తెలంగాణ వ్యాప్తంగా ఫుల్ మద్యం అమ్మకాలు జరుగుతాయి. మందుబాబులు మత్తులో మునిగి తేలుతుంటారు. అయితే ఈసారి దసరా పండగ, గాంధీ జయంతి ఒకే రోజు రావడంతో మద్యం షాపులు మూతబడ్డాయి. కానీ, చాలా వరకూ ముందే రోజే మద్యం కొనుగోలు చేసి పండగ రోజు ఎంజాయ్ చేశారు. దీంతో మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా మద్యం కొనుగోళ్లు రికార్డు స్థాయిలో జరిగాయి.
సెప్టెంబర్ 30, అక్టోబర్ 1 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా రూ.419 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఇందులో సెప్టెంబర్ 30వ తేదీన రూ. 333 కోట్ల మద్యాన్ని మందుబాబులు కొనుగోలు చేయగా, అక్టోబర్ 1వ తేదీన రూ. 86 కోట్ల మద్యం సేల్స్ జరిగాయి. ఇక సెప్టెంబర్ 26 తేదీ నుంచి మద్యం అమ్మకాలు రెట్టింపు అయ్యాయి. శుక్రవారం మళ్లీ మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో మద్యం విక్రయాలు ఊపందుకున్నాయి. ఈ ఒక్కరోజే రూ.300 కోట్ల మద్యం కొనుగోళ్లు జరగవచ్చని అంచనా వేస్తున్నారు.