
హైదరాబాద్: మెగా హీరో వరుణ్ తేజ్ దసరా రోజు శుభవార్త తెలిపారు. వరుణ్-లావణ్య దంపతులకు సెప్టెంబర్ 10న పండంటి మొగబిడ్డ పుట్టిన విషయం తెలిసిందే. ఆ చిన్నారికి బారసాల జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ పర్వదినాన.. తమ కుమారుడి పేరును వరుణ్ దంపతులు సోషల్‌మీడియా వేదికగా వెల్లడించారు. ‘ఆంజనేయ స్వామి దయతో పుట్టిన మా బాబుకు ‘వాయువ్ తేజ్ కొణిదెల’ అనే పేరు పెట్టాం. మీ అందరి దీవెనలు కావాలి’ అంటూ కొన్ని ఫోటోలను పంచుకున్నారు.
2017లో ‘మిస్టర్’ అనే సినిమాలో వరుణ్, లావణ్య త్రిపాఠి కలిసి నటించారు. అక్కడ ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. 2023 నవంబర్ 1న ఇటలీలోని టస్కానీ వేదికగా వీరిద్దరు వివాహబంధంతో ఒక్కటయ్యారు.




