రిషబ్ శెట్టి హీరోగా నటించి.. స్వీయ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘కాంతార ఛాప్టర్ 1’. గురువారం విడుదలైన ఈ సినిమాకు మంచి ప్రేక్షకాదరణ లభించింది. తాజాగా ఈ సినిమాను అభినందిస్తూ.. జూ.ఎన్టిఆర్ పోస్ట్ పెట్టారు. సినిమా సక్సెస్ అయిన సందర్భంగా ఆయన చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.
‘‘అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నందకు ‘కాంతార ఛాప్టర్ 1’ టీమ్‌కు నా అభినందనలు. ముఖ్యంగా రిషబ్‌శెట్టి తన ఆలోచనలతో నటుడిగా, దర్శకుడిగా ఊహకందని అద్భుతాన్ని సృష్టించాడు. ఆయనపై నమ్మకంతో ఈ ప్రాజెక్టును నిర్మించిన హోంబలే ఫిల్మ్స్‌తో పాటు చిత్ర బృందంలోని ప్రతీ ఒక్కరికి శుభాకాంక్షలు’’ అని పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కాంతారా ఛాప్టర్ 1 సినిమా ప్రీ రిలీజ్ వేడుకతకు ఎన్టిఆర్ ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే.
ఇక 2022లో వచ్చిన కాంతారకు ఈ సినిమాను ప్రీక్వెల్‌గా తెరకెక్కింది. భారీ అంచనాలతో విడులైన ఈ సినిమా థియేటర్ చూసి జనాలు ఆధ్యాత్మిక అనుభూతితో బయటకు వస్తున్నారు. మరి కాంతారా లాగా ఈ సినిమా సూపర్ హిట్ అయి.. భారీగా కలెక్షన్లు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.